top of page
Home

కలపు కోరలు

రచనానురక్తి

నా గురించి | ABOUT ME

నా పేరు జగదీష్ బాబు. స్వస్థలం హైదరాబాదు. నేను ఆంగ్లము మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో M. A. కంపరేటివ్ లిటరేచర్ అండ్ ఇండియా స్టడీస్ పట్టా పుచ్చుకున్నాను. అజిమ్ ప్రేమజీ విశ్వవిద్యాలయంలో B. A. కంబైన్డ్ హ్యుమానిటీస్ పట్టా తీసుకున్నాను. గత మూడేండ్లుగా అజిమ్ ప్రేమజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశోధన సహాయకుడిగా పనిచేస్తూ, తెలుగు సాహిత్య సంపత్తిని ఆర్కైవ్ (Archive) చేస్తూ, కథలను మరియు పత్రికా ప్రచురణలను ఆంగ్లమునకు అనువాదిస్తున్నాను. ఈ అంతర్జాల మాధ్యమం ద్వారా నా రచనలను మీతో పంచుకోవడమే కాకుండా భద్రపరచుకోవాలని ఆశపడుతున్నాను. నా ఆంగ్లభాషా సాహిత్య ప్రత్యయ మెళుకువలను ఉపయోగించి సచేతనవాహ్య సమిష్టిలో రాసిన కవితలు ఇందులో ఎక్కువ. ఈ బ్లాగులోని రచనలను చదివే ముందు వాటి ముందుమాటలను తప్పనిసరిగా చదవమని మనవి.

 kalapukoralu_edited.png
About
intro

ఉపోద్ఘాతము | INTRO 

భాష్ భాషనే! అనే సంస్కృత క్రియా శబ్దమే భాష. మనిషి జంతువుల మధ్య ఉన్న ఒక బహుమానయాణమైన వ్యత్యాసం భాష. భాషకు అలంకారప్రాయమైన ఎన్నో భాషా అంశాలతో మిళితమై మనసు మీటలు నొక్కే తీయటి మాటల సమ్మేళనం భాషా సాహిత్యం. తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ పెరిగిన నేను, భాషపై మక్కువతో, భావాలను బహిరంగం చేసే ఒకానొక మాధ్యమంగా రచనలను ఎంచుకున్నాను. నా భావరూపం చెందిన ఈ మాటలు ‘సాహిత్య’పరమైనవో లేదో చదివి మీరే చెప్పాలి మరి.

behind the scenes

తెర వెనుక | BEHIND THE SCENES

మనసును భావాలు భావనలు కదిలించినప్పుడు కదిలిన కలపు అక్షరరూపం, పులి కోరల వేటుకున్నంత పదునైన ప్రభావం ఉంటుంది. నాలో మెదిలిన ఎన్నో అగమ్యమైన తలంపులకు, వాంఛలకు, వాస్తవాల వడదెబ్బలకు నిలదొక్కుకొని, నా మౌనం నుండి ఉబికిన అక్షరాలతో వాటికి ఘాటైన సమాధానమిచ్చాను. కలమును చేతబూనిన నాటి నా స్మృతులను రంగరించి ఈ మాధ్యమునకు ఉపోద్ఘాతముగా రచించిన నా మొదటి కథను కథాలతలో పొందుపరిచాను. చదివి దీవించండి.

Contact
CONTACT ME

To get notifications about new posts, please subscribe!
I won't spam your inbox.

Thanks for submitting!

bottom of page