top of page
Kalapu Koralu
8. ప్రేమ విత్తనాలు
ముందుమాట
ప్రేమతో ప్రేయసికి రాసే ప్రేమలేఖికమునకు ఉపోద్ఘాతము అందమైనదిగా ఉంటే బాగుంటుంది. అరుదుగా పోలికలో ఒలికే వస్తువులను మానవీకరణ చేస్తూ ప్రేయసి మనసును మెప్పించడం ఈ కవిత ఉద్దేశం.
కవిత
వింధ్యాది పర్వతాల సరసన ఠీవీగా నిలబడి
ప్రేమమఠపు పీఠాధిపతి రాధాదేవివై
సద్గుణపు సోయగములూగే వయ్యారపు నడకతో
వినయం, విజ్ఞానమనే భూషణాలంకృతురాలివై
పాల్కడలి పరవళ్ల నడుమ పరుగులిడే లక్ష్మీదేవివై
ప్రేమ అనే విత్తనాన్ని నాలో లోతుగా విత్తి
దూరంచేయనంత దగ్గరగా నాలో ఇమిడి అయినా నా సర్వేశ్వరికి
ప్రేమతో రాస్తున్న లేఖ!
bottom of page