top of page

1. నీలినీడలు

 

ముందుమాట

భావాల ముసుగుల మాటున మానవుడు సంధించే భావాల బాణాలు గుచ్చుకున్న ఓ జీవాత్మ, లోకపు పోకడలను పరికిస్తూ, తనపై ప్రబలుతున్న ప్రభావాలకు అక్షర రూపం ఈ విధంగా దాల్చినాడు.

 

కవిత

వీపున చల్లిన చూపుల రంగులు నానార్థాల సమూహ వరదలు

వికటించిన ప్రతి మాటల మలుపులు అందని పండుకు అంధ గాలములు

ఏపుగ పెరిగిన చీకటి వలపుకు ఎఱుకనేలే శ్వాసాన్వేషణలు

నలిగిన తుంటరి చింతల ఘర్షణ ఒంటరికవ్వం నీలపు నీడలు

నూతన స్నేహపు గజిబిజి నూతిన ఈతగాడి బహు చెడ్డిక్కట్లు

స్పర్శ రగిలి నవనాడులు వణకగ భోదపడినవిలే తిప్పలు పాట్లు

సాత్విక ప్రచ్యోదకన భయానక నవసతిగతులకు వొణికిన వోల్ట్లు

పుంజుకున్నవిలె పంజరపావుర ప్రేమమాలికల వెంపరలాట్లు

జనవిధి తనవధ ధన శూన్యగోళ జీవన భోదలు అసదా రణములు

నింగికెగిన నిబ్బర గబ్బిలములు వాయువిలీనపు అందపుహంగులు

మాడి అంతమై సంతసమున దాహార్తి జయించిన దుర్మార్గుడనై

గ్రహణరేఖ బహురూపుల ప్రసరిన గానబీజముకు గంధమునద్ది

ఒంటిగపోరుతు అంతరంగమున హడలిన బహుస్పందన నందనమున

ద్వంద్వతీరముల వ్యంగ్యజీవనపు పవిత్రపరిమళ గుభాలచింతన

నయనతీర నలుమూలల స్థావరమెండమావులకు నెలవులు కాగ

ఎగిసిపడిన శ్వాసలలకు మూలం అగ్గిరాగినటి శీలం కాదా?

భావోద్వేగపు జాడలులేని శీతల నాడుల సమూహ శిలపై

గ్రీష్మఋతువు ఉలిదెబ్బల కృషికీ శిల్పి పల్కు నిజమూర్తికి పబ్బతి

బహుముఖ సంజ్ఞల సర్వోత్తముడిగ ఈ చరాచరపు ఇష్టసఖుడవై

అందమైన బంధము నుండొలికిన నవ్వుకు రూపులా ఒదిగిపొ బాలక!

© 2019 by Jagadish Babu.

  • Facebook Social Icon
bottom of page