top of page

7. నాపై నా యుద్ధం

 

ముందుమాట

నాకు తెలియకుండా నాలో ఇంకొకడున్నాడు. నాకు నచ్చనివన్నీ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాలో ఎన్నో భయాలను పుట్టిస్తూ, నా ఊహలకందని పిరికితనాన్ని నాలో నింపుతూ, విర్రవీగిపోయాడు. ఓపిక నశిచింది. మంచి చెడుల సరిహద్దుల కంచెను నిర్మిస్తూ, నాతో నేనే మాటలాడిన సందర్భంలో.

 

కవిత

ఆవేదనలు ఆక్రోధనలు అంతరంగాల్లోనే అడుగంటి,

ఆవిరై, అంతమవుతున్నాయి

అసమాన స్వస్థాపన స్వాప్నికము స్వర్గముకు ఎప్పుడూ ద్వారము కాదు

భారములు భారములు అను భావనలు భౌతికమును ఇక భయపెట్టలేవు

రుణావేశ రణరంగమును రంగరించిన రీత్య,

రివ్వున విహరించే రెక్కల డొక్కలకదుముకొని దారుఢ్యమును ప్రదర్శిస్తున్నా

బెదిరింపులు పరకాయ ప్రవేశాలు,

పరిహాస సహవాస సన్నాహాలు మొదలెట్టడం ఇరువురితరం కాదు

శ్వాసల కొసల ఉనికి స్వరముల అసమతుల్యత పెంపు జేయ సంకల్పిస్తున్నా,

తీయని చేదుల తీపిని సంభ్రమించి సామరస్యమవు సందేశమును పంపిస్తున్నా

పోయినవేవి తిరిగి పొందలేను, ఉన్నవన్నీ నాకు మచ్చిక కాదు

మనోవేదనలో మునిగిన స్మరణ సమూహములకు సంధి సందేశములనిచ్చా

సాధించగలిగే ప్రళయ నివాసాయుధాలను సంధించి పెట్టుకో మరి!

© 2019 by Jagadish Babu.

  • Facebook Social Icon
bottom of page