top of page

6. నమ్మకానికి నామరూపాలు

 

ముందుమాట

దోహదాన్ని ఆశ్రయించే వారికి భరోసా ఇస్తూ, విశ్వాసంతో ముందుకడుగేస్తే భయకంపితుల్ని చేసే శిఖరాలను కూడా ఆగ్రహించ గలిగే నమ్మకాన్ని నూరిపోస్తూ, నిమిత్త మాత్రమైన మధ్యవర్తిత్వం చేయ సంకల్పించిన ఓ మానవతా రూపి.

 

కవిత

శిఖరాగ్రగణ్యం కాదు విశ్వసాధ్యం

అనితరాధిపత్య స్థావరం సమరసాగరం

ముంతెడు సంతస గంపెడు కలవర సమూహం

అంతర్గతారోపణ కలహోద్భవమూలం

ఆవలున్నది అనంతశేష సరళజీవం

కూడంబల్కి ఉద్ఘటించు కొండకోర్కెల ఆశాభావం

కఠినమైన కాలం నీరుగార్చే ప్రభావిత పదజాలం

శిఖరాస్తమయ జీవనబలిపీఠంవైపు కదం

తప్పిదముల త్రొక్క తపించసాగె శిఖరప్రయాణం

విఘ్నాలవాకిళ్ళ ఎగిరే గర్వ విజయకేతనం

మధ్యముడై అధముడు ధీరునివైపు శ్రమాయాణం

విరమింపజేసె ఉదారప్రసన్న పర్యవసానం

నిమ్నగతుల ఆశలకదముల ప్రణమిల్లుదాం

అలసిన మనసును హత్తుకొని పైకేగనిద్దాం

గతితప్పిన అధిష్టాన దిగంతులకు దోహదం

ప్రోద్బల్యం నూరిపోసి వదిలేద్దాం చూద్దాం

చేదుకు చేయూతనిచ్చి తీపికి తీరును నేర్పి

గమనిద్దాం హర్షిద్దాం విడుద్దాం నిలదీద్దాం

ప్రభావితోదార్పు మిళిత సాయం కాదా కనకం

మిగిలిపోదాం మధ్యన నిమిత్తమాత్రం.

bottom of page