top of page
Kalapu Koralu
3. కనులకందని కలలు
ముందుమాట
థ్యేయ సంచార సాధనాలను సమకూర్చుకొని, ఊహకందని నిరాకార అవాంతరాల అంధకారంలో స్తంభించిపోయి, నిరాక్షర రూపములో తన భావనలను గానం చేస్తున్న కవీంద్రుడు.
కవిత
నా కలలు కథలుగా కళారూపాలలో కాలమెల్లదీస్తుంటే
ముసిరిన ముదుసలి ముసుగైపోయెను యవ్వనజీవనం
మలిసంధ్య వేళలో గోధూళి గంధ గుభాళింపులు తాండవిస్తుంటే
హంగుల దిహంగంలో హతవిధిని హాయిగా హత్తుకుంటుంటే
గగనాన్నంటే గళానికి గంధర్వ గంధం గుభాళించుకుని
తట్టిలేపిన గట్టిమనిషికి గుట్టునెల్లా రట్టుచేస్తూ
ప్రళయ నిలయ ఆశల వలయములు గీత సారమును గానంచేస్తే
థ్యేయ దాహముల మూల్య అంకణముల దేహసౌధమును హడలెత్తిస్తే
అవగతంకాని పొంతనేలేని అగాథ భ్రాంతుల రొమ్ముల మోస్తూ
నయనా దేశము రుణావేశముల శిరసావహించి ఒరిగిపోవలెను.
bottom of page