top of page

9. ఏమిది? విధి!

 

ముందుమాట

సిల్వియ ప్లాత్ రచించిన 'మార్నింగ్ సాంగ్' అనే కవితను దృష్టిలో ఉంచుకుని, తీరని వేదనలో ఉన్న పసిబాలుడు తన తల్లితో మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఊహను కల్పించి రాసింది ఈ కవిత.

 

కవిత

పూర్వ జన్మ సుకృతంబు చేత

యోగ బలంబు వలన

పూజితంబు స్త్రీ జనంబునెత్తి

పునర్జన్మనిచ్చు పావన యోగ్యతనర్చించిన

అనలామయీ ఆనందమూర్తీ ఆదిమూర్తీ

ఏమిది ఏవిధి ఏమిటిది?


చింతలో నాచెంత చెలిమితో ఆడుకొను

చేతలే చేయవా నా హతవిధీ!

ఇమిడి యుంటి నీలొ యిడదీసినావా నను

కనక గడియారమా నాకు పోలి!


శిశువుగా ఉన్న నను

పశువుతోనా పోల్చి

పాలనిచ్చావ నువు

న్యాయమా నీకు ఇది?


జననంబు నిచ్చి నీ జీవనంబుగ నాకు

జనయించ లేవ నువు జననిగా నాకై

పిలవనా నాయమ్మ కమ్మగా నిన్నిపుడు

పలకవే మాయమ్మ అమ్మగా నువ్విప్పుడు.

bottom of page