top of page

4. అంతం తెలియని పంతం

 

 
ముందుమాట

క్రియా పదాలను మరియు వెశేషణములను ఒక పాదములో పొందుపరుస్తూ, వాటిగుండా ఎలాంటి సంయోగ పదాలను కూర్చకుండా, ఒక కవితానిర్మాణమును చేపట్ట సంకల్పించాను. ఇది దాని ప్రతిఫలము. కనులను, కన్నీటిని, శ్వాస తీవ్రతలను ఒక చోట కూర్చి, కారణములను తెలపకుండా పర్యవసానములైన భావములకు పెద్ద పీట వేసినది ఈ కవితము.

కవిత

కొండంచులు గోరంతలు కనుగంతల భయభ్రాంతులు
నవవన్నెలు పలుభాషలు నడివెన్నెల ధ్వజహోరులు
నిజకరువులు నిట్టూర్పులు పదబారుల మదివేటలు
గజధీరులు ఘనశూరులు తనువాటల మృదుశూన్యులు
దాయాదులు ఇలవేల్పులు దరిశేషుల వగలేడ్పులు
కనురేవులు అనలకొనలు రుణకోతల సుడిగాలులు
తడిరెప్పలు జలకాటలు స్వాహార్త్రుల ప్రగల్భాలు
మున్నీరులు అనుభవాలు తారాంతల ఆత్మీయులు
పెనువానలు కనుధారలు తడిజాడల సమూహాలు
హితజీవులు పయనాలు మారణ క్రొవ్వొత్తులు.

bottom of page